Tollywood news in telugu

ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్, రాజమౌళి.. ముగ్గురు ఒకే ఫ్రెమ్ లో ఎందుకు కలిశారంటే?

NTR, Pawan Kalyan, Rajamouli .. all three in the same frame

టాలీవుడ్ ఇండస్ట్రీలో  గతంలో వారి వారి హీరోల గురించి అభిమానులు గొడవలు పడేవారు. హీరోలను తక్కువచేస్తూ మాట్లాడుతూ అభిమానులు ఒకరినొకరు పోట్లాడుకొని ప్రణాలమీదికి కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయ్. కానీ ప్రస్తుతం హీరోల మధ్య నెలకొన్న వాతావరణం అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. 

అగ్ర హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండడం వల్ల  నా హీరో నీ హీరో అనే బేధాలు దాదాపుగా ఇపుడు తక్కువైపోయాయి. అందరిని సమానంగా చూస్తున్నారు. ఎక్కడో కొందరు… నందమూరి అంటూ.. మెగా ఫ్యామిలీ అంటూ  పట్టుకొని ఉన్నారు . ఇపుడు పెద్ద  హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనబడుతూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు.

  ఇదిలా ఉంటె  తాజాగా  పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కలుసుకున్నారు. పవన్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ ఫ్యాక్టరీకి  కొంచెం దూరంలో RRR సెట్స్ ఉండడంతో పవన్ అక్కడికి వెళ్లి రాజమౌళిని ఎన్టీఆర్ ను కలిశారు. అక్కడ ఉన్న  సెట్స్ ను చూసి ,  పవన్, తారక్ తో అలాగే రాజమౌళితో  సినిమా కష్టాలు  అడిగి తెలుసుకున్నారట.

ఇక పవన్ కళ్యాన్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక  సినిమా రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరి కల ఎపుడు తీరుతుందో చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button