NTR, Koratala Shiva movie behind stories : బన్నీ బదులు తారక్ తో ఫిక్స్ అయినా కొరటాల శివ ? :-

NTR Koratala Shiva movie behind stories : కొరటాల శివ , ఈయన సినిమా చూడని ప్రేక్షకుడు ఉండడు. తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. ప్రతి హీరోని చాల స్టైలిష్ గా , నెవెర్ బిఫోర్ లుక్ తో పాటు కథ పరంగా కూడా మంచి మెసేజ్ ఉన్నవే తీశారు ఇప్పటివరకు.
ఇదిలా ఉండగా కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ చేసే పనిలో యమా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా కొరటాల తదుపరి చిత్రం బన్నీ తో అని 2020 లోనే అధికారికంగా ప్రకటించారు. కానీ బన్నీ అనుకోకుండా పుష్ప ని రెండు భాగాలుగా చేయడానికి ఒప్పుకోవడం తో పుష్ప తోనే సంవత్సరం అంత గడిచిపోయింది. వచ్చే ఏదాది అంటే 2022 సమ్మర్ వరకు పుష్ప తోనే సమయం గడపగా. పుష్ప తర్వాత కొరటాల కంటే ముందు కమిట్ అయినా సినిమాలు ఐకాన్ , బోయపాటి చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇవి పూర్తయ్యాకనే బన్నీ, కొరటాల సినిమా ఉండచ్చు అని టాక్.
అనగా బన్నీ , కొరటాల కాంబినేషన్ లో సినిమా 2023 లో ఉండచు. ఈ లోపు కొరటాల ఆచార్య తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక బన్నీ కి చెప్పిన కథలోనే కొని మార్పులు చేసి ఎన్టీఆర్ కి నరేషన్ చేశారని చిత్రసీమ లో టాక్.
ఎన్టీఆర్ కి తగ్గట్టు కథలో చేంజెస్ చేశారని, అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల తో చేయబోయే కథ అని టాక్ వినిపిస్తున్నాయి.
ఇదే కనుక నిజమైతే బన్నీ, కొరటాల కాంబినేషన్ సినిమా ఇప్పట్లో ఉండదు. ఆచార్య తర్వాత ఎన్టీఆర్ కొరటాల సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించే వారి వివరాలు త్వరలో అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తుంది.
చూడాలో మరి కొరటాల బన్నీ కోసం కొత్త కథ సిద్ధం చేసి, బన్నీతో అనుకున్న కథ నీ ఎన్టీఆర్ తో సినిమా అనే విషయం పై ఎంత వరకు నిజమో అని క్లారిటీ రావాల్సి ఉంది.