సినిమా బాగుంది కానీ కలెక్షన్స్ లేవు?
సినిమా బాగుంది కానీ కలెక్షన్స్ లేవు?
ఎన్. టీ ఆర్ ఈ సినిమా చూసిన వాళ్ళు బాగుంది బొమ్మ అన్నారు కానీ తీరా కలెక్షన్స్ రోజు రోజు తగ్గుతునే వచ్చాయి , ఈ సంక్రాంతికి విన్నర్ అని అందరూ అనుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిందనే చెప్పాలి , దీనికి కారణాలు లేకపోలేదు అనుకున్నన్ని థియేటర్స్ లేకపోవటం ఒకటైతే , సంక్రాంతికి కి బారి పోటీ ఉండటము మరో కారణము.
అయితే ఇంకొందరి వాదన అన్ని పాజిటివ్ అంశాలు చూపిస్తే అందులో త్రిల్ ఏముంది అని అనుకునే వాళ్ళు, ఇంకొందరు బాలకృష్ణ చేశాడు కాబట్టి అందులో వాస్తవాలు అన్ని చూపించే అంశాలు ఉండవని చూడని వాళ్ళు ఉన్నారు, ఎది ఏమైనా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న సినిమా బోల్తా పడింది, అసలు ఏ ఎక్స్పె క్ట్స్ లేకుండా స్టార్ కాస్ట్ లేకుండా వచ్చిన బయో పిక్ మహనట్టి పెద్ద విజయం సాధించింది.
ఎప్పటికైనా బయో పిక్ అంటే అన్ని అంశాలు అన్నీ కోణాలు ఉంటేనే పరిపూర్ణంగా ఉంటుందనేది కాదనలేని సత్యం. అయితే సినిమా బాగానే ఉందని చూసిన వాళ్ళు చెప్పిన మళ్ళీ మళ్లీ చూసే అంశాలు లేకపోవటం తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది , అయితే మరి రెండో బాగం లో అయిన అన్ని అంశాలు కవర్ చేస్తారో వేచి చూడాల్సిందే.