NTR and Vijay Sethupathi : తారక్ తో ఢీ కొడుతున్న విజయ్ సేతుపతి….ఈ కాంబో కలిస్తే ఉప్పెనే ఇక…!

NTR And Vijay Sethupathi: యంగ్ టైగర్ తారక్ ప్రస్తుతం ‘RRR ’ సినిమాలో నటిస్తూ చాలా బిజిగా ఉన్నాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో గిరిజన వీరుడు కొమరం భీంగా టైగర్ కనపడబోతున్నాడు. ఈ సినిమా పూర్తీ చేసుకున్నాక తారక్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ సినిమాకు మంచి పేరును పరిశీలిస్తున్నారు కూడా .
ఇదిలా ఉంటే తారక్ తో తీయబోయే త్రివిక్రమ్ సినిమాలో, ఇపుడు వార్తల్లో, షోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. విజయ్ సేతుపతి తారక్ తో డీ కొననున్నాడని ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారంటూ ఫిలిం నగర్లో టాక్.

ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్ లో చేసి ఆకట్టుకున్నాడు. అలాగే దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీలోనూ సైలెంట్ విలన్‌గా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతంచేసుకున్నాడు.

ఇక ఇపుడు తారక్‌తో పోటీ పడటానికి సేతుపతే సరైనోడు అని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. నటన పరంగా ఇద్దరు పులులు అనే చెప్పవచ్చు. దాంతో ఎన్టీఆర్ సినిమాకు విజయ్ సేతుపతే విలన్‌గా సెట్ అవుతాడని త్రివిక్రమ్ అనుకుంటున్నారని బయట టాక్. ఇక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే సేతుపతి ఒప్పుకుంటాడనే వార్తకూడా ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ తొందర్లో రాబోతుంది.