Tollywood news in telugu

చూస్తుంటే రికార్డ్ తిరగరాసేలా ఉందే!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ లో ఎప్పటికి మరపురాని, మరిచిపోలేని లెజెండరీ స్టార్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారు ఒకరు నందమూరి తారక్ రామారావు, మరొకరు అక్కినేని నాగేశ్వరరావు. వీరి నటన గురించి, వారు సంపాదించుకున్న కీర్తి, పేరు,ప్రతిష్టల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వీరిద్దరూ దాదాపు 14 చిత్రాలలో కలిసి నటించారు. వృత్తి పరంగా పోటీ ఉన్నప్పటికీ బయట మాత్రం వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉండేవారు. ఎన్టీఆర్-ఎన్నార్ ల మధ్య ఉన్న బంధo ప్రతి ఒక్కరికి ఆదర్శం అని వారిని బాగా దగ్గరగా గమనించిన వారు చెప్తుంటారు.

నిన్న ఏఎన్నార్ గారి 94 వ జన్మదినం  సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ntr biopic లో ఏఎన్నార్ గారిలా ఉన్న సుమంత్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. మనవడు తాతగారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్టు సుమంత్ తాత గారి లుక్ లో కనిపించడం చూసి ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ తో సోషల్ మీడియాలో సుమంత్ బాగా పాపులర్ అయ్యాడు. చిత్ర యూనిట్ అంతటితో ఆగకుండా మరో బ్రహ్మాండమైన సర్ప్రైస్ ని కూడా అక్కినేని మరియు నందమూరి ఫాన్స్ కి ఇచ్చింది. అదేమిటంటే ఏఎన్నార్ మరియు ఎన్టీఆర్ కలిసి ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. అందులో సుమంత్ తన నోట్లో సిగరెట్ వెలిగించుకుని బాలయ్య సిగిరెట్ ని వెలిగిస్తున్న పోజ్ తో వావ్ సూపర్ అనుకునేలా ఉంది.

Read  కొణిదెల వారింట మోగనున్న పెళ్లిబాజాలు....సిద్దమైన ఉదయ్ పూర్ విలాస్ !

ఈ ఫోటోలో ఉన్నట్టు వాస్తవంగానే వీరిద్దరూ కలిసి పొగ తాగిన ఫోటోలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయట. వాటిని ఆధారంగా చేసుకునే క్రిష్ ఈ సన్నివేశాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఎలాంటి కల్పితం లేదు. కాకపోతే డైరెక్టర్ క్రిష్ ఏంటో నాచ్యురల్ గా ఈ సన్నివేశాన్ని తీయడo గొప్ప విషయం. ఈ పిక్‌ని సోషల్ మీడియాలో సుమంత్ షేర్ చేసి ‘‘ఆనాటి సహోదరత్వాన్ని మరోసారి క్రియేట్ చేస్తున్నాం’’ అని ట్యాగ్ చేశారు. ఈ రెండు పాత్రలలో సుమంత్, బాలకృష్ణ లను చూస్తుంటే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ ఇద్దరూ స్వయంగా దివి నుంచి భువికి దిగివచ్చారా దిగొచ్చారా ఏంటి? అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఈ పోస్టర్ విడుదలైన కాసేపట్లోనే వైరల్ గా మారింది. నిన్న రిలీజ్ అయిన ఈ రెండు పోస్టర్స్ తో ntr biopic పై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి.

ఎన్టీఆర్ చిత్ర యూనిట్ త్వరలో బసవతారకం గారి పాత్ర చేసిన విద్యా బాలన్ పోస్టర్ ని కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ  నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ntr biopic  చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా కనిపించనున్నారు. ఒక్కొక్కటిగా ఇప్పటివరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ తో చిత్ర యూనిట్ పాత్రల విషయంలో ఎoతో జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. జనవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Read  ఏడేళ్ల ప్రయాణ ముచ్చట్లు చెప్పిన ఢిల్లీ భామ !

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button