Tollywood news in telugu

రికార్డ్స్ దిశగా నోటా టీజర్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపించే హీరో పేరు ఎవరిది అంటే vijay devarakonda అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “పెళ్లిచూపులు” మూవీ ద్వారా తొలిసారి హీరోగా నటించి తన టాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకి రుచి చూపించాడు. ఆ తరువాత  వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా తెలుగులో ముఖ్యంగా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో తన సక్సెస్‌ రేటును పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదల అయిన గీత గోవిందం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అర్జున్ రెడ్డి లైఫ్ టైమ్ కలెక్షన్లను పది రోజుల్లోనే గీత గోవిందం మూవీ దాటేసింది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న పొలిటికల్ ఎంటర్టైనర్ నోటా మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను చిత్ర యూనిట్ అక్టోబర్ 5న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

vijay devarakondaహీరోగా వస్తున్న ఈ ‘నోటా’ మూవీపై కూడా ప్రేక్షకులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు.  ‘నోటా’లో విజయ్ ముఖ్యమంత్రి పాత్రే చేస్తున్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గురువారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ రోజు శాంపిల్ గా 30 సెకండ్స్  ‘స్నీక్ పీక్’ వీడియోని  రిలీజ్ చేశారు నిర్మాతలు.  ‘ది రౌడీ, ది పొలిటీషియన్, ది లీడర్’ అంటూ ఇది పక్కా పొలిటికల్ డ్రామా అనే ఇండికేషన్ ఇస్తోంది ‘నోటా’ టీజర్. ఈ స్నీక్ పీక్ లో ఒక్క డైలాగ్ లేదు. ఈ వీడియోలో మొదట vijay devarakonda రౌడీ అవతారం, ఆ తర్వాత పోలిటిషియన్ గెటప్, ఫైనల్ గా లీడర్ గా ట్రాన్స్ ఫార్మేషన్.

Read  యాంకర్ రష్మీ కరోనా కోరల్లో చిక్కుకుంది...షూటింగ్స్ రద్దు.. పూర్తి వివరాలు !

తెరమీద రాజకీయ నాయకుడిగా నటించడం ప్రతి హీరోకి ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చేదే. అందులోనూ ముఖ్యమంత్రి పాత్ర చేయడం మరింత ప్రత్యేకం. ‘ఒకే ఒక్కడు’లో అర్జున్, ‘లీడర్’లో దగ్గుబాటి రానా, ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు సీఎం పాత్రల్లో తమదైన ముద్ర వేశారు. ప్రేక్షకుల మనసు గెలిచారు. మరి విజయ్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే. మెహ్రీన్ పిరజాడ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసారు. జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ భాషలో విజయ్ స్వయంగా డబ్బింగ్ చెప్తున్నారు. సామ్ సి. ఎస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read  యాంకర్ రష్మీ మరోసారి ముద్దులతో రెచ్చిపోయింది: వీడియో వైరల్

 

 

 

.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button