Today Telugu News Updates

బయటపడ్డ మిషన్ భగీరథ నాణ్యతా లోపాలు, No quality in mission baghiradha

 మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా లోపాలు No quality in mission baghiradha బట్టబయలవుతున్నాయి . దశల వారీగా లోపాలు వెలుగులోకి వస్తున్నాయి . తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు లక్షకోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నిర్మాణాల పనుల్లో నాణ్యత లోపింది . పైపులు పాక్షికంగా దెబ్బతినడం , వాటర్ ట్యాంకర్ల నిర్మాణాలలో కాంట్రాక్టరు చేతివాటం ప్రదర్శించడం ద్వార ఎక్కువ ఏళ్ళకు తరబడి ఉండవలసిన ట్యాంకులు కొన్ని నెలల వ్యవధిలోనే పగళ్ళు రావడం , కూలిపోవడం వాటిని మీరు గుతున్నాయి .

 ఇదే ఘటన కల్వకుర్తి డివిజన్ వంగూర్ మండల పరిధిలోని చింతపల్లి గ్రామంలో గల ప్రధాన రహదారి పక్కన ఆరు నెలల క్రితం నిర్మించిన లక్ష లీటర్లు గల కేఎల్ సామర్థ్యం గల ఓవర్సైడ్ వాటర్ ట్యాంక్ ను నిర్మించారు . ప్రారంభ దశలో భాగంగా వాటర్ ను ట్యాంకు లోకి నీళ్ళు పంపడంతో వాటర్ ట్యాంక్ కు పగుళ్ళు వచ్చి వాటర్ ట్యాంక్ బునాది వేసి.పిల్లర్లతో సహా కిందకు పడేటట్టు ఒకవైపుకు కుంగింది . అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా , కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వాటర్ ట్యాంక్ లు ఎంతకాలం మనుగడలో ఉంటయని డిండి చింతపల్లి ప్రజలు పేర్కొ న్నారు .

No quality in mission baghiradha::

 ఈ విషయం తెలుసుకున్న అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దిక్కుడు వంశీ కృష్ణ డిండి చింతపల్లి గ్రామంలోని వాటర్ ట్యాండను పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మిషన్ భగీరథ పథకం రాష్ట్ర ప్రజలకు తలమానికం లాంటిదన్న రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని , మెషిన్  భగీరథలో భాగంగా చేపడుతున్న వాటర్ ట్యాంకులు , కొండపోచమ్మ గట్టు కాలువ తెగిపోవడం , ఇతర పైప్ లైన్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని  తెరాస ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు . ప్రజలకోసం తెరాస ప్రభుత్వం పనిచేయడం లేదని తెరాస గుత్తేదార్లకు కొత్త నిర్మాణాల కాంట్రాక్టు ఇవ్వడంతో ధనార్జనే ధ్యేయంగా మాడ్చుకొని నాసిరకపు నిర్మాణాలను నిర్మిస్తూ ప్రభుత్వ సామ్ము కు గండి కొట్టి ప్రజల సొమ్ము దండుకుంటున్నారని , అధికార పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట లాగా ఉందని వంశీ కృష్ణ ఎద్దేవా చేశారు .

 లక్ష లీటర్ల సామర్థ్యం గల ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం డిండి చింతపల్లి గ్రామంలోని కుళాయి ద్వారా నీటి సరఫరా జరగాలని , అతి తక్కువ సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణంలో నాసిరకపు వస్తువులు వినియోగించడంలో పూర్తిగా దెబ్బతిందని పగుళ్లు యేర్పడయని ఏ క్షణంలో కూలుతుందో అని గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ భయానికి గురవుతున్నారని చంగ్ కృష్ణ ఆన్నాడు .. వర్షాకాలం కావడంతో వాటర్ ట్యాంకు ఏ క్షణాల్లో ఐన కూలవచ్చని దీనివల్ల గ్రామ ప్రజలకు , వాహన చోదకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని , దీనికి కారణమైన కాంట్రాక్టర్ అధికారులపై కటిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డిసిన జిల్లా అద్యక్షులు అచ్చంపేట్ మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ డిమాండ్ చేసారు . ఈ కార్యక్రమంలో ఉసినీ మెంబర్ అలోక్ రెడ్డి , కాంగ్రెస్ నాయ కులు ముత్యాల్ దాసరి అంజయ్య విష్ణు వర్ధన్ రెడ్డి , సాధిక్ అబీ దాసరి భీమయ్య , గ్రామస్తులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button