ఇక సిమ్ లేకుండానే మాట్లాడే టెక్నాలజీ !

E-Sim : ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది అని చెప్పవచ్చు . ఒక్కప్పుడు ల్యాండ్ ఫోన్లే గొప్ప అయితే అటు పిమ్మట సెల్ ఫోన్ వచ్చింది . ఇప్పుడు అది స్మార్ట్ ఫోన్‌గా మారి ప్రపంచం ను మన అరచేతిలో పెట్టింది. అలాగే సిమ్ కార్డు కూడా స్మార్ట్‌గా మననుంది . మొదట్లో పెద్దగా ఉండే సిమ్ కార్డు.. ఆ తర్వాత మైక్రో.. ఇప్పుడు నానోగా మారింది. ఇక తాజాగా ఈ-సిమ్ కార్డులు రానున్నాయి .
వీటి ద్వారా ఫోన్‌లో సిమ్ కార్డు లేకుండానే మనవారితో మాట్లాడే వెసులుబాటు రానుంది. అసలు ‘ఈ-సిమ్’ అంటే ఏంటి చూద్దాం. ఈ-సిమ్ ఫుల్ ఫార్మ్ ఎలక్ట్రానిక్ లేదా ఎంబెడ్‌డ్ సిమ్. దీని ద్వారా మీకు నచ్చిన టెలికాం సబ్‌స్క్రిప్షన్ సర్వీసును సెలెక్ట్ చేసుకొని కాల్స్ చేసే అవకాశం ఉంటుంది.
అదే విదంగా దీనిని సపోర్ట్ చేసే డివైస్‌లలో ‘ఈ-సిమ్ ప్రొఫైల్’ను డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు . జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి టెలికాం ఆపరేటర్లు వారి వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కలుగజేస్తున్నాయి .