Tollywood news in telugu
పిలువని పేరంటాలకు రానున్న పోలీసులు…ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే !

ఇక నుండి కరోనా మహమ్మారి జోరును తగ్గించడానికి పోలీసులు పిలువని పేరంటాలకు వెళ్లే పరిస్థితి వచ్చిపడింది. హర్యానాలోని గురుగ్రామ్ పోలీసు కమిషనర్ కెకె రావు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నగరంలో జరిగే వేడుకలకు పోలీసులు వెళ్లనున్నారు .
వేడుకలకు వచ్చే బంధువులను నిశితంగా పరిశీలించి , మాస్కులు ధరించని బందువులకు జరిమానాలు వేసే పనిలో అప్పడ్డారు . వైరస్ వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. హర్యానాలో కేసులు పెరగుతుండటంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు అని అధికారులు తెలిపారు.