telugu gods devotional information in telugu

ఈరోజు నందా సప్తమి విశేషాలు

ఈరోజు యొక్క ఆధ్యాత్మిక ప్రత్యేకతలు.

ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి . . . శుక్రవారం. దీన్నే నందా సప్తమి అంటారు జయ సప్తమి అన్న పేరు కూడా కలదు. నందా సప్తమి రోజు చేసే ఆరాధన ఫలితం ఆనందానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును కలుగ జేస్తుంది. సప్తమి తిధి సూర్యుని యొక్క ఆరాధన కు ప్రత్యేకం ఎందుకంటే సూర్య నారాయణ మూర్తికి ఇష్టమైన తిధి అంతే కాకుండా ఆయన జన్మదిన తిధి కూడా సప్తమి నే. ఈరోజు శతభిష నక్షత్రం తో కుడి యున్నది కావున శతబీష నక్షత్రం ఆరోగ్యం కోసం ఏదైనా కార్యం తలపెట్టుటకు, వైద్యం ప్రారంభించుటకు యోగవంతమైంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిత్యునికి ఇష్టమైన తిధితో కలసి ఉన్నది.

ఈరోజు సూర్యునికి ఆరాధన చేసి ఏదేని నైవేద్యాన్ని లేదా పాలను వంద భాగాలుగా ఓం జయాయ నమః అన్న నామంతో నివేదన చేయాలి. వీలయితే ఆదిత్య హృదయం పఠనం చేయాలి. సూర్య నమస్కారం చేయాలి. ఇవన్ని చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆర్యోక్తి. ఓం జయాయ నమః

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button