Nithin Tie up with Surendar Reddy : నితిన్ తో సురేందర్ రెడ్డి సినిమా మరి పవన్ కళ్యాణ్ సినిమా ? :-

Nithin Tie up with Surendar Reddy : సురేందర్ రెడ్డి సినిమాలు చాల కొత్తగా మరియు స్టైలిష్ గా ఉంటాయి. అందుకే అందరు సురేందర్ రెడ్డి ని స్టైలిష్ డైరెక్టర్ అని పిలుస్తారు. అయితే సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత చాల కాలం వెయిట్ చేసి అక్కినేని అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది.
ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి తదుపరి సినిమా ఉండబోతుంది అని, పవన్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ వదిలి అధికారికంగా ప్రకటించారు.
అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు టైం లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈలోపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ , హరిహర వీర మల్లు , హరీష్ శంకర్ తో సినిమాలు పూర్తిచేసే పనిలో ఉంటారని తెలిసింది.
సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా తీస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరిలోగా పూర్తయి విడుదల అవ్వబోతుంది. అయితే జనవరి 2022 నుంచి ఆగష్టు వరకు ఖాళీ గా ఉండడం ఎందుకు అని సురేంద్ర రెడ్డి నితిన్ తో రొమాంటిక్ సినిమా ప్లాన్ చేసారు. ఈ సినిమా జనవరి లో మొదలయి మార్చ్ లోపల షూటింగ్ అయిపోకోటేసి సమ్మర్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు.
అటు పక్క నితిన్ కి కూడా లైన్ నచ్చడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాని నితిన్ తన బ్యానర్ లోనే నిర్మించబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తారు.