రివ్యూ: నితిన్ ‘మాస్ట్రో’ మూవీ | Nithin Maestro Movie Review

Review:- Maestro Movie (2021)
Actors :- నితిన్, తమన్నా , నభా నటేష్
Producers :- సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి
Music Director :- మహతి స్వర సాగర్
Director:- మేర్లపాక గాంధీ
లాక్ డౌన్ లో ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సినిమాలు ఓటీటీ లో విదుదలయ్యాయి. కానీ లాక్ డౌన్ తర్వాత ప్రజలను ఓటీటీ నుంచి దూరం చేయాలనీ , థియేటర్లని కాపాడాలని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయం లో నితిన్ అన్నింటికీ విరుధంగా ఓటీటీ ద్వారా మాస్ట్రో సినిమానీ విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఈరోజు హాట్ స్టార్ లో విడుదయయింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు మనం చూద్దాం.
Maestro Story
ఈ కథ అరుణ్ ( నితిన్ ) గోవా లోని పియానో వాయిస్తూ దాని ద్వారా వచ్చే డబ్బుతో జీవితం కొనసాగించే ఒక బ్లైండ్ పర్సన్ నీ చూపించడం తో మొదలవుతుంది. అరుణ్ కి కళ్ళు కనిపించవు, కానీ పియానో వాయించడం లో ఎక్స్పర్ట్. ఒకరోజు అరుణ్ పియానో వాయించడం చూసి ఇంప్రెస్స్ అయి నరేష్ తన ప్రైవేట్ వెడ్డింగ్ యానివర్సరీ కి అరుణ్ తో పియానో కన్సర్న్ పెటించుకుంటాడు. నరేష్ భార్య అయినా సిమ్రాన్ ( తమన్నా భాటియా ) కూడా దీనికి ఒప్పుకుంది. అరుణ్ ఆరోజు రాత్రంతా పియానో వాయిస్తూ అక్కడే ఉన్నాడు. అనుకోకుండా ఒక మర్డర్ జరుగుతుంది. అరుణ్ ఈ కేసు లో బుక్ అవుతాడు. అసలు మర్డర్ అయింది ఎవరు ? అరుణ్ మర్డర్ విషయం తెలుసుకున్నాక ఎం చేయబోతున్నాడు ? వీటన్నిట్లో సిమ్రాన్ పాత్రా ఏంటి ? సిమ్రాన్ ని పోలీసులు విచారించారా ? వీటన్నిటి మధ్య నాభ నటేష్ పాత్రా ఎక్కడ ఉంది ? నితిన్ మరియు నాభ నరేష్ రిలేషన్ ఎటువంటిది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా హాట్ స్టార్ లో చూసేయాల్సిందే.
👍 :-
- నితిన్ మరియు తమన్నా పెర్ఫార్మన్స్ తో సినిమా చివరి నిమిషం వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రజలను కట్టిపడేస్తారు. వీరిద్దరూ ఒకరిని మించి ఇంకొకరు చాల బాగా నటించారు. నభ నటేష్ కూడా ఉన్నంతవరకు బాగానే చేసింది. మిగిలిన పాత్రధారులు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
- కథ మరియు కథనం
- మ్యూజిక్ చాలా బాగుంది.
- దర్శకత్వం.
- ఎడిటింగ్ బాగుంది.
- సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎 :-
- టెన్షన్ సీన్స్ జరుగుతున్నపుడు అనవసరంగా సాంగ్ రావడం.
- డ్రామా ఒరిజినల్ లో ఉన్నంత ఉండదు.
ముగింపు :-
మొత్తానికి మాస్ట్రో సినిమాతో , వరుస ఫ్లోప్స్ తో బాధ పడుతున్న నితిన్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కళ్ళు లేనివాడిగా ఎక్కడ ఎక్కువ , తక్కువ కాకుండా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నితిన్ కి పోటాపోటీగా తమన్నా కూడా ఎక్కడ తగ్గకుండా చాల బాగా నటించింది. నాభ నటేష్ ఉన్నంతవరకు బాగానే చేసింది. మిగితా పాత్రధారులు కూడా బానేచేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ రీమేక్ చేస్తున్నప్పటికీ ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చాల జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లు తీశారు.మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాల స్టైలిష్ గా ఉంది. ఒరిజినల్ చుసిన వారికి ఇందులో డ్రామా మిస్ అయినట్లు అనిపిస్తది. దానికి తోడు టెన్షన్ సీన్స్ జరుగుతున్నా సమయం లో పాట రావడం ప్రేక్షకులు మూడ్ ఆఫ్ చేస్తాయి. మొత్తానికి మాస్ట్రో సినిమా ఒరిజినల్ చూడని వారికీ చాల బాగా నచ్చుతుంది.
Rating :- 3 /5