Tollywood news in telugu

Nithin as Political Leader : రాజకీయ నాయకుడి గా మారిన నితిన్ :-

Nithin as Political Leader

Nithin as Political Leader : నితిన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నపటికీ , విడుదలైన సినిమాలు ప్లాప్ అవ్వడం తో చాల డీలా పడిపోయారు. వరుసగా చెక్ , రంగ్ దే ప్లాప్ అవ్వడం తో ఆశలని ఓటీటీ లో విదుదలవ్వబోతున్న మాస్ట్రో మీదనే పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే నితిన్ , కృతి శెట్టి జంట గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. ఆ సినిమా పేరు మాచెర్ల నియోజకవర్గం. ఈ సినిమా షూటింగ్ మొదలయింది.ఈ సినిమా కి డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో మొట్ట మొదటి సారి నితిన్ రాజకీయ నాయకుడి గా కనిపించబోతున్నారనీ చిత్ర సీమలో టాక్ . కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే ఈ సినిమాలో నితిన్ నెవెర్ బిఫోర్ రోల్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రాజకీయ నాయకుడిగా నితిన్ ఎలా కనిపించబోతున్నాడో మరియు మాచెర్ల నియోజకవర్గం లో నితిన్ ఎం చేయబోతున్నాడో , దీనికి తోడు కంప్లీట్ మాస్ ఎలెమెంట్స్ అనేసరికి అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి మార్చ్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి నితిన్ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button