Tollywood news in telugu
కార్తీక పూర్ణమి కి గుడిలో పూజలు చేసిన హీరో నిఖిల్ !

హీరో నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు కార్తీక పూర్ణమి కావడంతో నిఖిల్ గుడిలో దీపాలను వెలిగించాడు. సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్ దీపాలను వెలిగించి స్వామివారి ఆశీస్సులను అందుకున్నాడు.
ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్ తెలిపాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘కార్తికేయ’ సీక్వెల్ రానుండగా , మరో రెండు సినిమాలను వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్నాయి.
గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సీక్వెల్ పైన ప్రత్యేక దృష్టిపెట్టాడు నిఖిల్.