Nikhil and Sudheer Varma Deadly Combination : హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అయినా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ :-

Nikhil and Sudheer Varma Deadly Combination : ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎవరు అని అనుకుంటున్నారా ? ఆ కాంబినేషన్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లా వర్షం కురిపించాయి. దానికితోడు రెండు థ్రిల్లర్ సినిమాలే అవి. అవేవో కాదండి సుధీర్ వర్మ మరియు నిఖిల్ చేసిన సినిమాలే. ఒకటి స్వామి రారా మరొకటి కేశవ.
ఇపుడు మీకు మ్యాటర్ అర్ధం అయింది అనుకుంట. సుధీర్ వర్మ దర్శకత్వం లో నిఖిల్ నటించిన రెండు థ్రిల్లర్ సినిమాలకు ప్రజాధారణ చాల బాగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ కాంబినేషన్ సర్వం సిద్ధం అయింది.
సుధీర్ వర్మ మరియు నిఖిల్ కలిసి మూడోసారి సినిమా చేయబోతున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.యస్.యాన్. ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రం లో ఎక్కువ భాగం షూటింగ్ లండన్ లో జరగబోతుంది అని తెలిసింది. నవంబర్ 1 నుంచి వరుసగా 40 రోజుల పాటు లండన్ లోని పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేయనున్నారు.
ఈసారి కూడా వీరిద్దరూ థ్రిల్లర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు , కాకపోతే కథ చాల కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టేందుకు సుధీర్ వర్మ మరియు నిఖిల్ సిద్ధం అయ్యారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.