Tollywood news in telugu
కొణిదెల వారింట మోగనున్న పెళ్లిబాజాలు….సిద్దమైన ఉదయ్ పూర్ విలాస్ !

niharika wedding: కొణిదెల నిహారిక పెళ్లి కి రంగం సిద్ధమైంది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా ప్రింటయింది. డిసెంబర్ 9న బుధవారం రాత్రి మిధున లగ్నంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగబోతుంది .
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ నగరంలోని ఉదయ్‌పూర్ విలాస్‌లో ఈ పెళ్లి మహోత్సవానికి రంగం సిద్ధమైంది.
నిహారికకు కాబోయే భర్త చైతన్య గుంటూరుకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ పెళ్లి కార్యక్రమాల కోసం నిహారిక, వరుణ్‌తేజ ముందస్తుగానే రాజస్థాన్ వెళ్లి నట్టు సమాచారం . పెళ్లి తరవాత జరిగే రిసెప్షన్ డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది.