Tollywood news in telugu
నిహారిక చిన్ననాటి రోజులు తలచుకొని భావోద్వేగానికి గురైన నాగబాబు !

నిహారిక చిన్నప్పుడు స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకు ఇప్పటికి గుర్తుంది. నా ముద్దుల కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే చాల సంవత్సరాలు పట్టింది. ఇపుడు పెళ్లి అయ్యేంత పెద్దదైందా అనే నిజం నుండి తేరుకోడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో అని భావోద్వేగానికి గురి అవుతూ చెప్పాడు.
నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు . ఇదిలా ఉంటె నిహారిక నాగబాబు కూతురుగానే కాకుండా సినీ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.