Today Telugu News Updates
అభివృద్ధిలో భాగంగా…. హుస్సేన్ సాగర్ దగ్గర నైట్ బజార్ !

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివ్రుది పై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది. పర్యాటక ప్రాంతమైన మన రాజధాని హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి .
ఈ మధ్యన దుర్గం చెరువు పై తీగల వంతెనను ఏర్పాటు చేయడం చూశాం , అలాగే బయోడైవర్సిటీ ని కూడా ఎర్పాటు చేసింది.
నగరంలోని ప్రజలు సేద తీరడానికి గ్రీన్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. అలాగే హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద జెండాను ఎగుర వేసింది.
ఇపుడు తాజాగా హుస్సేన్ సాగర్ పరిధిలో నైట్ బజార్లను ఏర్పాటు చేసేపనిలో ఉంది.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని,
పీపీఈ పద్ధతిలో నైట్ బజార్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ నైట్ బజార్లో బోర్డింగ్ వాక్,సిట్టింగ్ ప్లేసెస్, పార్కింగ్ సౌకర్యాలు ఉండేలా చూస్తామని తెలిపారు.