News Sandalwood Drug Scandal :యూరిన్ లో ట్యాప్ వాటర్ కలిపిన.. నటి రాగిణి

News Sandalwood Drug Scandal:కన్నడ డ్రాగ్ రాకెట్ ఉచ్చులో చిక్కిన నటి రాగిణి ద్వివేది చేసిన పనికి సినీ ఇండస్ట్రీ మొత్తం తల దించుకొని పరిస్థితి వచ్చింది.
డ్రగ్స్ కేసులో రాగిణి పేరు బయటికి రావడంతో ,తనని పోలీసులు శాంపిల్స్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ,తాను ప్రజలని,పోలీసులని తప్పుదోవ పట్టించడానికి ప్రయతించిందని తెలుస్తుంది.
రాగిణిని డాక్టర్ టెస్ట్ కోసం యూరిని శాంపిల్ ని తీసుకురమ్మని చెప్పడంతో రాగిణి బాత్రూమ్ లోకి వెళ్లి తన యూరిన్ లో కాస్త ట్యాప్ వాటర్ కూడా కలిపి డాక్టర్ కి ఇచ్చింది.
ఈ విషయం పసిగట్టిన డాక్టర్ ,కాసేపటి తరవాత ట్యాప్ లేని మరో రూమ్ లోకి పంపించి యూరిన్ ని తెమ్మన్నాడు.
వాటి రిజల్ట్ ని న్యాయస్థానానికి ఇస్తూ ,రాగిణి డ్రగ్స్ వాడిన విషయాన్నీ బయట పెట్టాడు. ఈ విషయం పై తనని 3రోజులపాటు రిమాండ్ లో ఉంచింది న్యాయస్థానం.
అలాగే కర్ణాటకలో RTC అధికారులకు కూడా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .
కర్ణాటక హోo మంత్రి దీనిపై స్పందిస్తూ డ్రగ్స్ మాఫియాకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.