technology information

Google Maps: సరికొత్త హంగులను జోడించనున్న గూగుల్ మ్యాప్స్ ….. మరింత సులభతరం కానుంది !

New Features In Google Maps

New Features In Google Maps: ఒకప్పుడు దారిలో కలిసే కనయ్యాలందర్నీ అడ్రస్ చిట్టి పట్టుకోనో , కులాన్ని ఆధారం చేసుకొనో , పేరు ద్వారానో ఆ అడ్రెస్స్ ని దొరకపట్టేవారు.  మరిప్పుడు కాలం మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ అందులో గూగుల మ్యాప్స్ ఉంటె చాలు మనం ఎక్కడికి వెళ్లాలో చెప్తే అదే తీసుకెళ్లే టెక్నాలజీ ఇపుడు అందుబాటులో ఉంది.

 ఈ గూగుల మ్యాప్స్  ఎప్పటికప్పుడు తన కొంగొత్త ఫీచర్లతో వినియోగదారుడిని ఆకర్షిస్తూనే ఉంది. ఇపుడు యూజర్ల ‌ను మరింత ఆకట్టుకోవడానికి గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్స్ ని జోడించనుంది.

అదేంటంటే  కమాండ్స్ ద్వారా ప్రదేశాలను గుర్తించే వెసులుబాటును తీసుకొచ్చింది. ఇది కేవలం ఇంగ్లిష్‌లోనే కాకుండా..తమిళం, హిందీ, తెలుగు, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మళయాళం, పంజాబీ, మరాఠీ,  ఒడియా భాషల్లో అందుబాటులోకి రానుంది. 

దీంతో ఈ గూగుల్ మ్యాప్ ని వాడే వారందరు కేవలం వారు ఎక్కడికి వెళ్లాలో చెప్తే చాలు ‘వాయిస్ కమాండ్ల’ ద్వారా ఆ ప్రదేశాన్నితీసుకెళ్తుంది. దీనిలో భాగంగానే మ్యాప్స్ యాప్‌లో కొత్తగా లక్షల సంఖ్యలో ప్రముఖ ప్రదేశాలను జోడించారు. వీటి ద్వారా ఇకనుండి సులభంగా  రైల్వేస్టేషన్లు, దుకాణాలు, బస్టాపులు వంటి ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్ గుర్తిస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button