Naga Babu: ఆ పని చేసినందుకు నాగబాబుపై నెటిజన్లు ఫైర్ …

Naga Babu: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపు వాడుకోకుండా.. తనకంటూ స్టార్ డమ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాగబాబు ఇటు మంచి సినిమా పాత్రలో నటిస్తూ అటు రియాల్టీ షో తో బిజీగా గడుపుతున్నాడు.

ఎప్పుడూ నాగబాబు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్విట్టర్ ని వాడుతుంటారు. తాను ఏమైనా తెలియజేయాలనుకున్నా, ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకున్న ట్విట్టర్ వేదికగా తెలియజేస్తారు.
అదేవిధంగా నిన్న ఏ ఆర్ రెహమాన్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపాగా… అలాగే నిన్న మరో ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బర్త్డే కావడంతో.. శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ ఈ బర్త్డే విషెస్ తో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్న కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం పోస్టర్ ని షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అది కపిల్ దేవ్ కాదు రణవీర్ సింగ్ అంటూ కామెంట్లు పెడుతూ రచ్చ రచ్చ చేశారు. దీంతో నాగబాబు సారీ చెప్పి ఫోటోను తొలగించారు.

ప్రస్తుతం నాగబాబు జీ తెలుగు టీవీ ఛానల్ లోని అదిరింది, బొమ్మ అదిరింది అనే రెండు టీవీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో “ఖుషి ఖుషి” గా అనే స్టాండప్ కామెడీ కూడా ఇటీవలే స్టార్ట్ చేశారు