Tollywood news in telugu
Negative Roles by Kajal Agarwal : నెగటివ్ రోల్స్ చేయనున్న కాజల్ అగర్వాల్:-

Negative Roles by Kajal Agarwal : అవును మీరు విన్నది నిజమే. కాజల్ అగర్వాల్ నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధమైంది. గత దశాబ్ద కాలం నుంచి కుర్రాలని తన నటనతో నిద్ర పోనీకుండా చేసిన ఈ అమ్మడు ఇటీవలే పెళ్లి చేసుకొని అందరి హృదయాలను గాయపరిచిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు నెగటివ్ పాత్రా చేయనుంది. ఈ విషయం విన్నాక అభిమానుల హృదయాలు మరల గాయపడ్డాయి.
కాజల్ ఏంటి నెగటివ్ రోల్ ఏంటి అని అందరు అనుకుంటున్నారు కదా. అదేంటంటే నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ చిత్రంలో కాజల్ నటించనుంది. ప్రవీణ్ సత్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
అయితే ఈ చిత్రం లో కాజల్ రా ఏజెంట్ గా నెగటివ్ పాత్ర చేయబోతోందని సమాచారం. చూడాలి మరి ఈ సినిమాలో కాజల్ నటన ఎలా ఉండబోతుందో మరియు అభిమానులు ఈ వార్తని ఎలా స్వీకరించబోతున్నారని.