Tollywood news in telugu

Dethadi Harika song : యూట్యూబ్ లో దేత్తడి హారిక న్యూ లుక్.. డాన్స్ తో అదరగొట్టింది… వైరల్ వీడియో…!

neeli neeli kallavadu song

neeli neeli kallavadu song : బిగ్‌బాస్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక ఇపుడు తన యూట్యూబ్ లైఫ్ ని కంటిన్యూ చేస్తుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక  హారిక కు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ సినిమాలలో మాత్రం హరికకు తగ్గట్టు అవకాశాలు రావట్లేదు.

మొన్న మహిళా  దినోత్స‌వం సంద‌‌ర్భంగా తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా హారిక‌ను నియ‌మిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నియ‌మాక ప‌త్రాన్ని హరికకు అందజేశారు. కానీ పర్యాటక  సంబంధించిన వెబ్‌సైట్‌లోనూ హారిక పేరును తీసివేశారు. దీనికి సంబంధించి ప్రజలలో కూడా కొంత అయోమయానికి గురి అయ్యారు. ఇంతకీ హారిక బ్రాండ్ అంబాసిడర్ గా  ఉన్నట్లా.. లేనట్టా అని అనుమానపడుతున్నారు. మ‌రోవైపు దీనిపై శ్రీనివాస్ గుప్తా క్లారిటీ ఇస్తూ  ఈ ప‌ద‌వి నుంచి హారిక స్వయంగా తప్పుకున్నారని తెలిపాడు. ఇదే విషయాన్నీ హారిక  సోష‌ల్ మీడియాలో తెలిపింది. దీంతో ఆ వివాదానికి తెర‌ప‌డింది.

బిగ్ బాస్  హౌజ్‌లోకి వెళ్లేముందు దేత్త‌డి హారిక పేరు మీద  యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసి.  తన  వీడియోలు అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ.. వారి అభిమానాన్ని పొందేది. బిగ్‌బాస్ ద్వారా త‌న‌కు వ‌చ్చిన ఫేమ్‌ని కంటిన్యూ చేసేందుకు హారిక రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఓ ఫోక్ పాట‌కు స్టెప్పులు వేసి వీడియోను షోషల్ మీడియాలో వదిలారు హారిక‌. ‘నీలి నీలి క‌ళ్ల వాడే’ అంటూ హారిక చేసిన డ్యాన్స్ ఆమె అభిమానుల‌ను కట్టిపడేసింది. ఈ పాటకు  ర‌ఘు మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయగా…. ఇపుడు ఈ పాట యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button