Tollywood news in telugu

Nee peru prema deshama song from Akshara film getting superb responce !!!

మెలోడీతో మెస్మరైజ్ చేస్తున్న అక్షర.. ‘నీ పేరు ప్రేమ దేశమా’ పాటకు అద్భుత స్పందన

టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నందితశ్వేతా లీడ్ రోల్ చేస్తున్న చిత్రం అక్షర. బి. చిన్న కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ‘కనులకు కాపాలాగా ఉంచా నీపేరు ప్రేమ దేశమా’ సాంగ్ రిలీజ్ అయిన అద్భుత స్పందన సొంతం చేసుకుంది.

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఓ మెలోడీ సాంగ్ లిరిక‌ల్ టీజ‌ర్ ని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. `క‌నుల‌ను కాప‌లాగ వుంచా.. నీ పేరు ప్రేమ దేశ‌మా..మ‌న‌సుకు త‌లుపుల‌న్ని తెరిచా.. నీ ప్రేమ‌కింత అంద‌మా..` అంటూ యువ గేయ ర‌చ‌యిత బాలాజీ రాయ‌గా అనుదీప్ దేవ్ ఆల‌పించిన‌ ఈ పాట మెలోడియ‌స్‌గా ఆక‌ట్టుకుంటోంది. బాలాజీ సాహిత్యానికి త‌గ్గ రీతిలో సురేష్ బొబ్బిలి అందించిన స్వ‌రాలు పాట‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. మంచి సాహిత్యం.. సంగీతంల క‌ల‌బోత‌గా వున్న ఈ పాట సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఈ మెలోడీ అక్షర ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న స్పందన యూనిట్ లో నూతనోత్సాహాన్ని కలిగించింది . సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి- అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్ర‌మిది. టీజ‌ర్ ఇప్ప‌టికే జ‌నాల్లోకి దూసుకెళ్లింది.

నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్,
షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో కనిపించబోతోన్న ఈ చిత్రానికి
కెమెరామాన్ : నగేష్ బెనల్
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : జి.సత్య
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి
కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు
లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి
పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా,
కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్
నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ
రచన, దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button