Tollywood news in telugu
తల్లి చీర ధరించి మురిసిపోయిన నిహారిక !

నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో జరగబోతుంది . కొణిదెల నిహారిక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో నిర్వహించాలని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసింది . దీనికోసమని రాజస్థాన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫొటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ చేస్తుంది.
అయితే, ఆ ఫొటోలో నిహారిక కట్టుకున్న చీర తన అమ్మది అని తెలిపింది . నాడు నిహారిక తల్లి పద్మజ తన నిశ్చితార్థం టైం లో కట్టుకున్న చీరనే ఇప్పుడు నిహారిక ధరించి మురిసి పోయింది . 32 ఏళ్ళ తన అమ్మచేరను కట్టుకున్న ఎలా ఉంది అని తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది.