Tollywood news in telugu

NBK The Baap Of All Shows : పుకార్లకు చెక్ పెట్టిన ఆహ బృందం :-

NBK The Baap Of All Shows

NBK The Baap Of All Shows : హెడ్డింగ్ చదవగానే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి కదా , కంగారు పడకండి మేమె చెప్పేస్తాం. ఆహా ఏ విషయం పైన క్లారిటీ ఇచ్చింటది అని అనుకుంటున్నారు కదా.

గత వారం రోజులనుంచి బాలయ్య బాబు మీద ఎన్నో పుకార్లు వచ్చాయి. బాలయ్య బాబు ఆహ లో హోస్ట్ గా షో చేయబోతున్నారని. అ షో చాల డిఫరెంట్ గా ఉండబోతుందని ఎన్నో రకరకాల పుకార్లు చిత్రసీమ లో విపరీతనగా టాక్ నడించింది.

అయితే ఈరోజు ఆహ బృందం ఈ విషయం పై స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. ఇన్నిరోజులు పుకార్లుగా చెప్పుకున్న విషయం ఈరోజు అధికారికంగా ప్రకటించేసారు. మొత్తానికి పుకార్లే నిజం అయ్యాయి. బాలయ్య బాబు మొట్టమొదటి సారి గా ఆహ లోని టాక్ షో కి హోస్ట్ గా చేయబోతున్నారు. ఈ షో కి ప్రముఖ దర్శకుడు అయినా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ షో యొక్క స్పెషలిటీ ఏంటంటే బాలయ్య బాబు సినీ పరిశ్రమ లోని సెలబ్రిటీస్ ని ఈ షో కి పిలిపించి వారితో సరదాగా ముచ్చట్లాడుతూనే వారి గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు తెలిసేలా చేయడమే ఈ షో , కాకపోతే అక్కడ ప్రశ్నలు అడిగేది నందమూరి బాలకృష్ణ గారు కాబట్టి ఈ షో ఎంతో ప్రత్యేకంగా నిలవబోతుంది.

ఈ షో కి టైటిల్ గా అన్ స్టాపబుల్ , ది బాప్ అఫ్ ఆల్ షోస్ అని ట్యాగ్ లైన్ కూడా ఉంది. మొత్తానికి బాలకృష్ణ గారిని హోస్ట్ గా చూడబోతున్నాం అని అర్ధం అయింది.

చూడాలి మరి బాలకృష్ణ గారు హోస్ట్ గా ఎలా చేయబోతున్నారో , తన స్టైల్ లో ప్రేక్షకులని ఎలా అలరించబోతున్నారో వేచి చూడాలి.

దీనితోపాటు బాలయ్య బాబు అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. గోపీచంద్ మలినేని తో ఒక సినిమా ఉంది. ఇప్పుడు బాలయ్య బాబు ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ఈ టాక్ షో తో బిజీ అయిపోబోతున్నారని అర్ధం అయింది. బాలయ్య బాబు ని వెండి తేర మరియు బుల్లితెర మీద చూసి అభిమానులు ఆనందించే సమయం రానే వచ్చేసింది. ఎంజాయ్ ది బాప్ అఫ్ అల్ షోస్.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button