Tollywood news in telugu

Naveen Polishetty Returned Advances : అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చేసిన నవీన్ పోలిశెట్టి ?

Naveen Polishetty Returned Advances given to him

Naveen Polishetty Returned Advances given to him : ఇపుడు వస్తున్నా హీరోలలో ది బెస్ట్ ఫౌండ్ అఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందిన హీరో నవీన్ పోలిశెట్టి. ఇతను తెలుగు లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ముఖ్య పాత్రా చేసిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ లో ట్రైల్స్ వేసి లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి చిచోర్‌ సినిమా తీశారు. ఈ సినిమాలో అయన పాత్రా మరియు నటనకి మొత్తం బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు వచ్చేసింది.

తర్వాత మరల తెలుగు లో ట్రయిల్ వేశారు. ఈసారి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ గా వచ్చారు. తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ లో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఇదే సక్సెస్ కంటిన్యూ చేసి జాతి రత్నాలు తీసి టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు.

ఇదిలా ఉండగా ఈ జాతిరత్నాలు ఇచ్చిన సక్సెస్ తో వరుసబెట్టి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అందులో సితార ఎంటర్టైన్మెంట్ ఒకటి. ఈ ప్రొడక్షన్ హౌస్ నవీన్ కి 4 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. ఈ ప్రొడక్షన్ హౌస్ తరుపున నితిన్, కీర్తి సురేష్ రంగ్ దె సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన అతను వెళ్లి స్క్రిప్ట్ వినిపించారు. కానీ నవీన్ కి పెద్దగా నచ్చకపోవడం తో ఆ కథ ని రిజెక్ట్ చేసారు. కాబట్టి నవీన్ సితార ఎంటర్టైన్మెంట్స్ కి అడ్వాన్స్ 4 కోట్లు రిటర్న్ ఇచ్చేశారంట. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మొదటి దశలోనే ఆగిపోయింది.

ఇదిలా ఉండగా యు.వీ. క్రియేషన్స్ కూడా నవీన్ కి అడ్వాన్స్ ఇచ్చేశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ తో నవీన్ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. చూడాలి మరి నవీన్ తన సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తడో లేదో .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button