Tollywood news in telugu

Naveen Polishetty: “జాతి రత్నాలు” టీజర్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నవీన్ పొలిశెట్టి మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వి అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న “జాతి రత్నాలు” చిత్రంలో నవీన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర మొదటి టీజర్ ని విడుదల చేశారు.

ఈ టీజర్లో మొదట నవీన్ జైల్లో నేరస్తుడుగా ఉండి “మీ ఖాకీ బట్టలు తుపాకీ గుళ్ళు మనోళ్ళు నొక్క లేవు ఇన్స్పెక్టర్ “అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత ఫుల్ కామెడీ మ్యూజిక్ తో టీజర్ ముగిస్తుంది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి పోషించిన పాత్ర పేరు జోగిపేట్ శ్రీకాంత్.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మరో ఇద్దరు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా నటిస్తున్నారు ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వప్న సినిమా బ్యానర్ సంస్థ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది

Read  Namitha: ముద్దుగుమ్మ నమిత లేటెస్ట్ ఫోటోలు....కోలీవుడ్ లో కోలాహలమే ఇక...
“జాతి రత్నాలు” టీజర్

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button