Navarasa Telugu Movie:- నవరస (2021)

సినిమా :- Navarasa Telugu Movie 2021
నటీనటులు :- సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, రేవతి, పార్వతి తిరువోతు, ప్రయాగ మార్టిన్, అరవింద్ స్వామి, ప్రసన్న, పూర్ణ, ఢిల్లీ గణేష్, రోహిణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగి బాబు, రమ్య నంబీసన్, అదితి బాలన్, బాబీ సింహా, రిత్విక, శ్రీరామ్, అథర్వ, మణికుట్టన్, నేదుమూడి వేణు, అంజలి, కిషోర్
నిర్మాతలు:- : మణిరత్నం, జయేంద్ర పంచపాకేశన్
డైరెక్టర్స్ :– ప్రియదర్శన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, కార్తీక్ నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సర్జున్ KM, రథీంద్రన్ ఆర్. ప్రసాద్.
లాక్ డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు, వెబ్ సిరీస్ అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు మణిరత్నం నిర్మించిన నవరస వెబ్ సిరీస్ అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
కథ :-
కరుణ:- ఈ ఎపిసోడ్ తో సిరీస్ మొదలవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి మరియు రేవతి ప్రధాన పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ ఎపిసోడ్ నిదానంగా మొదలవగా ట్విస్ట్స్ బాగా పెట్టడం తో పర్వాలేదు అనిపించింది.
హస్య:- ఈ రెండవ ఎపిసోడ్ లో హాస్యం పండించాలని యోగి బాబు గారిని పెట్టి ప్రయత్నించారు, కానీ పెద్దగా నవ్వులు పండించలేకపోయారు. ఎదో నవరసాలలో హాస్య కూడా ఒకటి ఆనుకొని షూట్ చేసినట్లు అనిపించింది.
అద్భుత:- ఈ నరవరసాలలో ప్రేక్షకుల హృదయం లో మొదటి స్థానం లో కూర్చొబెట్టే ఎపిసోడ్ ఇది. అరవింద్ స్వామి ప్రధాన పాత్రా పోషించారు.
ఈ అద్భుత రసం ని చాల అంటే చాల అద్భుతంగా తీశారు. కథ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.
భీబాత్స:– ఈ ఎపిసోడ్ ఒక వృధుడు అయినా ఢిల్లీ గణేశన్ చుటూ తిరుగుతుంది. ఒకరి జీవితం లో ఇంకొకరు జోక్యం చేసుకోవడం వల్ల ఎలాంటి బాధను కలిగిస్తుంది అని చూపించారు. ఉన్నంతవరకు పర్వాలేదనిపించింది.
శాంతి:- ఈ ఎపిసోడ్ బాబీ సింహ , గౌతమ్ మీనన్ మధ్య నడుస్తుంది. ఒక బాలుడు తన తమ్ముడి కోసం బోర్డర్ దగ్గర ఉన్న బాబీ సింహ మరియు గౌతమ్ మీనన్ కి చెప్పగా, ప్రాణాలకు తెగించి వీరు ఎం చేశారు అనేది ఈ ఎపిసోడ్. చాల బాగా చిత్రీకరించారు.
రౌద్ర:- ఈ ఎపిసోడ్ ని అరవింద్ స్వామి దర్శకత్వం చేయగా ప్రేక్షకులని అలరించే ఎపిసోడ్స్ లో టాప్ 2 ఇది. ఈ ఎపిసోడ్ లోని కథ మరియు కధనం చాల అద్భుతంగా ఉంది. ట్విస్ట్స్ కూడా చాల బాగా పెట్టారు.
భయ:- ఈ ఎపిసోడ్ లో సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ ఎపిసోడ్ టాప్ 3 పొజిషన్ లో ఉంటుంది. నటించేవారు కాదు చూసే ప్రేక్షకులు కూడా భయానికి లోనవుతారు. చాల బాగా చిత్రీకరించారు.
వీర:– ఈ కథ నక్సలైట్స్ మరియు మిలిటరీ వారి చుటూ తిరుగుతుంది. ఆతర్వా మరియు అంజలి నటించారు ప్రేక్షకులని వారి నటనతో అలరిస్తారు. కథ మరియు కధనం ఆకట్టుకుంటుంది.
శృంగార:- ఈ ఎపిసోడ్ లో సూర్య ప్రధాన పాత్రలో పోషించగా చివరిలో ఈ ఎపిసోడ్ ని పెట్టారు, కానీ ఈ ఎపిసోడ్ టాప్ 4 లో నిలుస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ప్రతి సీన్ చాల అద్భుతంగా చిత్రీకరించారు. లవ్ ట్రాక్ బాగుంది ప్రేక్షకులని అలరిస్తుంది.
ముగింపు :-
మొత్తానికి ఈ నవరస అనే వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ తో ఉండగా అందులో 6 ఎపిసోడ్స్ ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది. మిగితావి కొంచెం బోర్ కోటించిన పర్వాలేదనిపిస్తాయి. ఈ వారం కుటుంబం అంత కలిసి ఈ వెబ్ సిరీస్ ని హ్యాపీ గా చూసేయచ్చు.
Navarasa rating :- 2.75/5