telugu cinema reviews in telugu language

Natyam Telugu movie Review (2021) | నాట్యం

Movie :- Natyam (2021) Review

నటీనటులు :- సంధ్య రాజు , కమల్ కామరాజు , శుభలేఖ సుధాకర్ మొదలగు

నిర్మాతలు :- సంధ్య రాజు

సంగీత దర్శకుడు :- శ్రావణ భరద్వాజ్

Director: – Rewanth Korokonda

Story (Spoiler Free) :-

ఈ కథ నాట్యం అనే గ్రామం లో సితార (సంధ్య రాజు) ని చూపిస్తూ మొదలవుతుంది . సితార బాల్యం నుంచి కాదంబరి అనే ప్రొఫెషనల్ డాన్సర్ ని చూస్తూ పెరిగింది. కాదంబరి యొక్క డాన్స్ సితారని ఎంతగానో ఆకట్టుకునేది.

ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాదంబరి యొక్క కథను ప్రజలకు నాట్యం రూపంలో చెప్పాలని సితార నిర్ణయించుకొని , డాన్స్ నేర్చుకోవడం , డాన్స్ షోస్ లో పాల్గునడం చేసేది సితార. అన్ని అనుకున్నది అనుకున్నట్లు సాగుతుంది అనుకునే సమయానికి రోహిత్ ఎంట్రీ తో సితార లైఫ్ లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.

రోహిత్ వళ్ళ సితార తన గ్రామం లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకునే పరిస్థితి వస్తుంది. అసలు రోహిత్ ఎవరు ? రోహిత్ వల్ల సితార ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుంది? వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండేది ? వీటన్నిటి మధ్య సితార ప్రజలకి చెప్పాలనుకున్న కాదంబరి కథను చెప్పగలిగింది లేదా ? చివరికి ఎం జరిగింది. ఇవ్వని తెలుసుకోవాలంటే నాట్యం సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

Positives 👍 :-

  • సంధ్య రాజు నటన ప్రేక్షకలను చాలా బాగా అలరిస్తుంది. తాను కోరియోగ్రఫీ చేసిన డాన్స్ కూడా అందరికీ బాగా నచ్చుతుంది. మొదటి సినిమానే అయిన సంధ్య రాజు ఎక్కడ తడబడలేదు. మిగితా నటీనటులు కూడా వారివారి పరిధిలో బాగా చేశారు.
  • కథ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి.
  • ఎడిటింగ్ పర్వాలేదు.
  • మ్యూజిక్ అలరిస్తుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎 :-

  • దర్శకుడు సరిగ్గా తియలేకపోయారు.
  • కథ బాగున్నప్పటికీ కథనం సరిగ్గా రాసుకొకపోవడంతో విఫలం అయ్యారు.
  • రోహిత్ తో ఉన్న సన్నివేశాలు ఇంకా బాగా ఉండాల్సింది.

Overall :-

మొత్తానికి నాట్యం అనే సినిమా డాన్స్ లవర్స్ కి చాల బాగా నచ్చుతుంది. కథ పేపర్ మీద బాగున్నప్పటికీ దాని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సంధ్యారాజు నటన , డాన్స్ , కోరియోగ్రఫీ అందరిని అలరిస్తుంది. మిగితా నటీనటులు కూడా వారివారి పరిధిలో బాగానే చేశారు.

కధనం మీద కాస్త ద్రుష్టి పెటింటే సినిమా అందరిని అలరించేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మ్యూజిక్ , డాన్స్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. డాన్స్ లవర్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వారం సంధ్యారాజు గారి నటన కోసం ఈ సినిమాని ఓసారి చూసేయచ్చు.

రేటింగ్ :- 2.5 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button