Tollywood news in telugu
Upasana: తన స్నేహితురాలి ‘నాట్యం’ ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా విడుదలచేసిన ఉపాసన !

Upasana Tweet Natyam First Look: మెగా కోడలు తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇక తను వ్యాపారంలోనూ ఎంతబాగా రాణిస్తున్నారో తెలిసిన విషయమే. అలాగే షోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటారు.
తన సోషల్ మీడియాలో భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన చాల విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఉపాసన తాజాగా ట్విట్టర్ ద్వారా తన స్నేహితురాలి ఓ కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఉపాసన ఫ్రెండ్ ఒక ప్రముఖ కూచిపుడి డ్యాన్సర్, ఇపుడు తాజాగా సంధ్యా రాజు ఇండస్ట్రీకి పరిచయంకాబోతున్నారు. ఈ సందర్భంగా సంధ్యా రాజును నటించిన . తన తొలి చిత్రం ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో షోషల్ మీడియాలో పంచుకున్నారు . ఈ సినిమాకు కొరుకొండ రేవంత్ దర్శకత్వం వహిస్తున్నారు .
ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్ర లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.