health tips in telugu
Migraine: మైగ్రెయిన్‌ను తగ్గించే హోం రెమెడీస్
కడుపు నొప్పిని భరించడం కష్టం అనుకుంటాం. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్న వార్తలను మనం తరచూ పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈ భరించలేని కడుపునొప్పి లాంటిదే మైగ్రేన్ కూడా. తలలో ఒకవైపు సమ్మెటతో బాధినట్లు ఉంటుంది. ఈ బాధలు మగ వారి కంటే కూడా ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి.
మైగ్రేన్ బాధలు మొదలైనప్పుడు ప్రశాంతంగా ఉన్న రూమ్‌లోకి వెళ్లి పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి మూలంగా మైగ్రేన్ నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

మెత్తని తడిగుడ్డను కళ్ల మీద వేసుకోవాలి. వేడినీటితో స్నానం చేయాలి.
ఆస్పిరిన్ లేదా పారాసిటిమాల్ బిళ్లలను వాడటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
తలనొప్పి మరీ విపరీతమైనపుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.