నరేష్ Vs బండ్ల గణేష్ :-

ఇటివలే సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని , ప్రస్తుతం అయన ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారని అందరికి తెలుసు.
అయితే సీనియర్ మోస్ట్ నటుడు అయినా నరేష్ గారు ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో సాయి ధరమ్ తేజ్ మరియు అతని అబ్బాయి చాల మంచి స్నేహితులని , ఇద్దరు రేసింగ్ లవర్స్ అని. ఒకసారి ఇద్దరినీ కూర్చోబెట్టి క్లాస్ ఇయ్యని అని అనుకున్న కానీ కుదరలేదు. ఆరోజు కూడా బైక్ సౌండ్ వచ్చింది నేను ఆపండి అని చెప్పేలోపే వెళ్ళిపోయారు.
అసలు సెలబ్రిటీస్ బైక్స్ కి దూరం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సాయి ధర్మం తేజ్ కూడా త్వరగా కోలుకొని మరల షూటింగ్స్ లో బిజీ అయిపోవాలి అని ఆ దేవుడిని మరియు మా అమ్మని ప్రార్థిస్తాను. ఇలాగె రోడ్డు ఆక్సిడెంట్ కారణంగానే కోట శ్రీనివాస రావు అబ్బాయి , బాబు మోహన్ వారి కుటుంబ సభ్యుడు చనిపోయి వారి కుటుంబానికి ఎనలేని లోటుని చేర్చిపెట్టారు అని నరేష్ చెప్పారు.
నరేష్ చెప్పిన మాటలకూ బండ్ల గణేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఒక వీడియో పోస్ట్ చేసారు. అందులో నరేష్ గారు మీ అబ్బాయి మరియు సాయి తేజ్ మంచి ఫ్రెండ్స్ ఏ ఎవరు కాదనడం లేదు. హాస్పిటల్ లో మనిషి పోరాడుతుంటే రోడ్ యాక్సిడెంట్ లో ఎవరెవరో చనిపోయారని చెప్పడం ఏంటి. ఒక ఉన్నత స్థానం లో ఉన్న మీరు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా. ఇపుడు చనిపోయిన వారి గురించి ఎందుకు చేపి అందరికి భయాందోళన చేస్తున్నారు అని ప్రశ్నించారు.
బండ్ల గణేష్ మాట్లాడిన మాటలో న్యాయం ఉంది. ఎందుకంటే సగటు నటుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు , ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నాడు అంటే అనందించకుండ నరేష్ గారు ఇలా గతం లో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారిని గుర్తుచేసి ఇలా ఇండైరెక్ట్ గా చెప్పడం బండ్ల గణేష్ కె కాదు ఎవరికీ నచ్చలేదు. చూడాలి మరి బండ్ల గణేష్ మాటలకి నరేష్ ఎలా రియాక్ట్ అవుతారో..