Nani Shyam Singaroi slightly to be postponed : పోస్ట్ పోన్ వైపు అడుగులు వేస్తున్న నాని శ్యామ్ సింగరాయ్ :-

Nani Shyam Singaroi slightly to be postponed : అవును ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో నాని శ్యామ్ సింగరాయ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ముందుగా ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లోనే విడుదల చేస్తాం అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇక సినిమా రిలీజ్ కి ప్రొమోషన్స్ చేసే పనిలో ఉండగా ఇప్పుడు సడన్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ అనే వార్తలు చిత్రసీమలో వినిపిస్తున్నాయి.
మ్యాటర్ లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ గారు , బోయపాటి శ్రీను కలిసి చేయబోయే 3 వ సినిమా అదేనండి అఖండ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఇంకా విడుదల తేదీ ప్రకటించకుండా ఉన్నారు.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏంటంటే అఖండ చిత్రబృందం త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారని అఖండ బృందం కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు విశ్లేష వర్గాలు చెప్తున్నాయి.
ఈ కారణం చేతనే నాని శ్యామ్ సింగరాయ్ సినిమా పోస్ట్ పోన్ చేయాలనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒకవేళ బాలయ్య అఖండ డిసెంబర్ 24 న ఫిక్స్ అయితే శ్యామ్ సింగరాయ్ విడుదల పోస్ట్ పోన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చిత్రసీమ లో టాక్ విపరీతంగా నడుస్తుంది.
త్వరలో అఖండ బృందం ఒక క్లారిటీ ఇయ్యబోతున్నారు. దాని బట్టి నాని సినిమా డిసెంబర్ లో వస్తుందా లేదా 2022 లో వస్తుందా అనే విషయం పై క్లారిటీ రాబోతుంది. చూడాలి మరి ఎం జరగబోతుందో.