Tollywood news in telugu
నాని కొత్త సినిమా టైటిల్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ !

నాని తన నాచురల్ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మన్నలను పొందాడు. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలను చేస్తూ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు.
ఇప్పటికే ‘టక్ జగదీశ్ ‘ మరియు ‘శ్యామ్ సింగరాయ్ ‘ సినిమాలను ప్రకటించాడు. తాజాగా నాని సినిమా ‘అంటే… సుదారానికి ‘ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని విడుదల చేసారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎర్నేని నవీన్,రవిశంకర్ లు నిర్మిస్తున్నారు. అదేవిదంగా వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
హీరో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటిస్తుంది.