telugu gods devotional information in telugu

నేటి నాగుల చవితి విశిష్టత

ఈరోజు విశేషం కార్తీక శుద్ధ చవితి,దీన్నే నాగుల చవితి అన్న పేరుతో కూడా పిలుస్తారు.ఆ నాగుల చవితికి సంబంధించిన కొన్ని విషయాలు మీ కోసం ఈ కథనంలో…

భారతీయ సనాతన సంప్రదాయం లో ప్రకృతి లో ఉన్నటువంటి ఉపయోగ పడే ప్రతి వస్తువుని , జీవిని ఏదో ఒక సంధర్బంగా పూజించే విశేషం ఉన్నది. అలాంటిదే ఈ నాగుల పూజ కూడా.రైతుల భూముల్లో ఉన్నటువంటి పురుగు పుట్రా తినడం ద్వారా భూసారాన్ని పెంచడం లో రైతులకు , భూగర్బ జలవనరులను పెంచడం లో ఇవేంతో తోడ్పడతాయి.

నాగుల చవితి రోజున ఉదయంలేచి స్నానాదులు ముగించుకుని సమీపం లో ఉన్నటువంటి పుట్ట వద్దకు వెళ్ళి యధాశక్తిగా ప్రార్ధన చేసి పుట్టకు పసుపు , కుంకుమలు సమర్పించి, పుట్టలో పాలు పోసి దీపారాధన చేయాలి. మన వల్ల తెలిసి తెలియక జరిగిన తప్పులను మన్నించమని వేడుకోవాలి.మన వంశ అభివృధ్ధికి నాగ దేవతల ఆశీస్సులు ఎంతగానో అవసరం. కాబట్టి ఆ సంకల్పం కూడా విన్నవించుకుని పుట్ట మన్ను కొద్దిగా గ్రహించి చెవులకు రాసుకుని , కొంత భాగాన్ని ఇంటికి తీసుకువచ్చి ద్వారము ఇరువైపులా రక్ష వలె నాగముద్ర వేయడం అన్నది అద్భుత పరిహారంగా చెప్పబడింది.

వీలయితే చలిమిడి, చిమ్మిలి , అరటి పళ్ళు లాంటివి నైవేద్యము గా చూపి నాగుల పేరు మీద అందరికి పంచడం అన్నది అత్యంత శుభాలు కలిగిస్తుంది. మీరు ఈ కింది స్తోత్రం ను నాగ క్షేత్ర సందర్శన సంధర్భంలో తప్పకుండా చదవండి.
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button