Tollywood news in telugu

Nagarjuna Sister : మాజీ మిస్ ఇండియాను తెలుగుతెరపైకి తెస్తున్న హీరో నాగార్జున …!

Nagarjuna Sister : కింగ్  నాగార్జున ఇటు టాలీవుడ్ లోను,  మరోవైపు బాలీవుడ్ లో కూడా  సినిమాలు చేస్తూ…ప్రేక్షకుల ఆదరణ పొందాడు. గతంలో  శివ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టి సూపర్ హిట్ కొట్టి  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కింగ్ నాగ్. అదేవిదంగా  అమితాబ్ సినిమా ‘ఖుదాగవా’ లో నటించిన , ఇపుడు తాజాగా  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’‌లో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ సినిమా  ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుగుతున్నాయి.

ఇప్పటివరకు  నాగార్జున  విభిన్న నేపధ్య లో సత్తా ఉండే  కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తాడు. ఈ సందర్బంగా  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా మొదలు పెట్టేసాడు. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అందేంటంటే  నాగ్  చెల్లెలుగా మాజీ మిస్ ఇండియాను తీసుకురావడానికి నిర్మాత, దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఆమె రేవరోకాదు చంఢీఘర్ భామ.. ‘గుల్‌పనాగ్’ అని సమాచారం. ఈమెతో పాటుగా గోవా బ్యూటీ ఇలియానాను కూడా సెలెక్ట్ చేసారని ఫిలిం నగర్ టాక్.

Read  అందాల అనసూయా....

ఈ తరహాలో తెలుగు తెరకు మిస్ ఇండియా లను మిస్ యూనివర్స్ లను తీసుకుని రావడం నాగార్జున కు  కొత్త కాదు.. గత సినిమాలు చూసినట్టైతే,   నాగార్జున హీరో నటించిన రక్షకుడు  సినిమాలో  మిస్ ఇండియా విశ్వసుందరి ‘సుస్మితా సేన్’ నటించింది. అలాగే ‘ రావోయి చందమామ’ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా  ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

ఇక నాగార్జున, ప్రవీణ్ సత్తార్ కాంబోలో  ఒక భారీ  సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ లను తీసుకుంటున్నారనే టాక్ వినబడుతుంది. ఇందులో నాగ్ పాత్ర ‘డిటెక్టివ్ ‘అని, దీన్ని పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్‌ల, నారాయణ దాస్ నారంగ్, నిర్మిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button