Tollywood news in telugu

పాత్రికేయుల సమావేశం లో కలుసుకున్న నాగార్జున, శ్రీముఖి..ఆప్యాయంగా దగ్గరికితీసుకున్న నాగ్..

NAGARJUNA AKKINENI MOVIES

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ఎక్కడున్నా సందడి వాతావరణం  మొదలవుతుంది. అటు  హుందాగా వ్యవహరిస్తూనే , సమయాన్ని బట్టి అల్లరి చేస్తూ ఉంటారు.  శ్రీముఖి.  తాజాగా ‘వైల్డ్ డాగ్’ పాత్రికేయుల సమావేశం  శ్రీముఖి , కింగ్ నాగార్జు చాలా కాలం తరవాత కలిశారు.

హీరో  నాగార్జున , దియా మీర్జా, సయామీ కేర్,  బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా,  అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ, అవిజిత్ దత్ లు ‘వైల్డ్ డాగ్’లో  ముఖ్య పాత్రలో నటించారు.  మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించగా….. అహిషోర్ సోలోమన్ డైరెక్ట్ చేసారు. ఇందులో  వైల్డ్ డాగ్  సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి, చిత్ర విశేషాలను చెప్పడానికి సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు.  ఈ సమావేశానికి శ్రీముఖి యాంకర్ గా  వ్యవహరించారు.

 సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నాగార్జునను, శ్రీముఖి పలకరించడానికి వెళ్లగా.. నాగ్  ఆప్యాయంగా శ్రీముఖిని హగ్ చేసుకున్నారు. ‘బిగ్ బాస్’ షోలో  ద్వారా నాగార్జునకు శ్రీముఖి దగ్గరైన విషయం అందరికి  తెలిసిందే. ఈ చనువుతోనే నాగార్జున వద్దకు వెళ్లారు శ్రీముఖి. ఈ సందర్బంగా శ్రీ ముఖి అంతబాగేనా అని అడుగుతూ నిన్ను చూసి చాల రోజులైంది అంటూ పలకరించారు.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

ఇక కార్యక్రమం లో వైల్డ్ డాగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల కానుంది అని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button