Tollywood news in telugu

ఎస్వీఆర్ గా మోహన్ బాబు కాదు… నాగబాబు


నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తన తండ్రి గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక మూవీ ‘ఎన్టీఆర్’. ఎన్.బి.కె.ఫిలింస్ ఎల్ఎల్‌పీ పతాకంపై బాలకృష్ణ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రజలు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రతి పాత్రకి సంభందించిన నటీనటులను బాలకృష్ణ గారు చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీలోని కొన్ని ముఖ్యమైన పాత్రలకు ప్రముఖ నటీనటులను ఎంపిక చేసారు.

తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు గారు జాయిన్ అయ్యారట. లెజెండ్రీ నటుడు ఎస్ వి రంగారావు పాత్రకు గాను మెగా బ్రదర్ నాగబాబును ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈచిత్రానికి సంభందించిన అసెంబ్లీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ, బాలకృష్ణ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇప్పటికే కొందరి నటీ నటుల పేర్లు చిత్రయూనిట్ తెలిపింది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్నారు. అలాగే నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ‘టైగర్’ హెచ్.ఎం.రెడ్డిగా” కనిపించనున్నారు. చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవడు సుమంత్ కనిపించనున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి కనిపించనున్నారు.

హరికృష్ణ హఠాన్మరణం తర్వాత వల్ల షూటింగ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి తిరిగి సోమవారం నుంచి కంటిన్యూ చేస్తున్నారని సమాచారం. మొదట ఎస్వీఆర్ పాత్రకు మోహన్ బాబుని అనుకున్నప్పటికి మహానటిలో మోహన్ బాబు చేసేసారు కాబట్టి ప్రేక్షకులకు ఆ తలపు రాకుండా నాగబాబును సెట్ చేసుకున్నట్టు తెలిసింది. ఎస్విఆర్ లాంటి గొప్ప పర్సనాలిటీ గల వ్యక్తికీ నాగబాబు కరెక్ట్ గా సెట్ అవుతాడు. కాకపోతే ఈ మధ్య విపరీతమైన గొంతు నెప్పితో బాధ పడుతూ సరిగా మాట్లాడలేకపోతున్న నాగబాబు డబ్బింగ్ విషయంలో గీత గోవిందం మాదిరిగానే మరోసారి రాజీ పడతాడా అనేది వేచి చూడాల్సిందే. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోగా కోలుకుంటే మంచిదే. ఒకపక్క అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తూనే మరోవైపు బాబాయ్ ఎన్టీఆర్ లో ఛాన్స్ కొట్టేసారు నాగబాబు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button