Naga Shourya Varudu kaavalenu movie Preponed : ప్రీపోన్ అయినా నాగశౌర్య సినిమా :-

Naga Shourya Varudu kaavalenu movie Preponed : నాగ శౌర్య గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మంచి కథ కోసం ఎంతదూరం అయినా వెళ్తారు , ప్రేక్షకులని , అభిమానులను అలరించాలని విశ్వా ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొన్ని విఫలం అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయోగాల పైన ప్రయోగాలు చేస్తుంటారు.
అలాంటి ప్రయోగాల లిస్ట్ లో ప్రస్తుతం వరుడు కావలెను మరియు లక్ష్య సినిమాలు ఉన్నాయి. రెండు విభిన్న కథనాలతో రూపొందిన సినిమాలు అని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
అయితే మ్యాటర్ లోకి వెళ్తే నాగ శౌర్య , రీతూ వర్మ నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా పాటలు , టీజర్ అని వర్గాల ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అని ఎందరో అడిగారు.
ముందుగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం చేశారు. కాకపోతే అక్టోబర్ 15 న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , రోషన్ పెళ్ళి సందడి అన్నింటికీ మించి శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ల మహా సముద్రం ఇలా ఇన్ని సినిమాల మధ్య పోటీ ఎందుకని విడుదల పోస్ట్ పోన్ చేసారు.
ఈ వరుడు కావలెను సినిమా పోస్ట్ పోన్ చేసి నవంబర్ నెలలో విడుదల చేయాలనీ అనుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 4 న విడుదల చేయాలనుకున్నారు. అని సక్రమంగా జరుగుతున్నాయి అని అనుకునే లోపే మరల ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ఈసారి పోస్ట్ పోన్ కాదు ప్రీపోన్.
నవంబర్ నెలలో శౌర్య లక్ష్య సినిమా విడుదల చేయబోతున్నారు కాబట్టి వరుడు కావలెను సినిమా నవంబర్ లో కాకుండా అక్టోబర్ 29 న విడుదల చేయబోతున్నాము అని అధికారికంగా ప్రకటించారు.
మొత్తానికి శౌర్య వరుడు కావలెను సినిమా అక్టోబర్ 29 న విడుదలకు సిద్ధం అయింది. ఈసారైనా ఎటువంటి ప్రీపోన్ మరియు పోస్ట్ పోన్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అయితే బాగుండు. చూడాలి మరి ఎం జరుగుతుందో.