Gossips

Naga Shourya Varudu Kaavalenu Movie Postpone : పోస్ట్ పోన్ అయినా నాగ శౌర్య వరుడు కావలెను :-

Naga Shourya Varudu Kaavalenu Movie Postpone

Naga Shourya Varudu Kaavalenu Movie Postpone : నాగ శౌర్య మరియు రీతు వర్మ కలిసి నటించిన ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ వరుడు కావలెను. ఈ సినిమా కి సంబందించిన పాటలు కానీ , ప్రోమోస్ కానీ , టీజర్ కానీ అని వర్గాల ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ప్రొమోషన్స్ కూడా బాగా చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 15 న ఈ సినిమా విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ చివరికి ఈ సినిమా పోస్ట్ పోన్ కి దారి తెస్తుంది.

మ్యాటర్ లోకి వెళ్తే ముందుగా వరుడు కావలెను సినిమా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం అయింది. కాకపోతే అక్టోబర్ 14 న శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ల మహా సముద్రం , అక్టోబర్ 15 న అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , మరియు రాఘవేంద్ర రావు సుపర్విజన్ లో శ్రీకాంత్ అబ్బాయి అయినా రోషన్ పెళ్ళి సందడి అనే సినిమా కూడా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం అయింది.

ఇలా వరుసగా సినిమాలు అదే రోజున విడుదల అవడం శౌర్య సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అని చిత్ర బృందం భావించి ఈ సినిమా ని పోస్ట్ పోన్ చేసారు. అందుకే ప్రొమోషన్స్ చేయడం లేదు.

మొత్తానికి వరుడు కావలెను అనే సినిమా అక్టోబర్ 15 న కాకుండా నవంబర్ 4 గా విడుదల చేయాలనీ చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నాయి. అయితే గతం లో నవంబర్ 4 న వరుణ్ తేజ్ గని సినిమా విడుదల అవుతుంది అనుకున్నారు కానీ ఇపుడు గని సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటించారు కాబట్టి , వరుడు కావలెను సినిమా నవంబర్ 4 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన జరగబోతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button