Naga Shourya Next level Promotions : మొట్టమొదటిసారి వెరైటీ ప్రొమోషన్స్ చేస్తున్న నాగ శౌర్య :-

Naga Shourya Next level Promotions : అవును మీరు చదివింది నిజమే. ఇంతవరకు టాలీవుడ్ లోనే కాదు ఏ ఫిలిం ఇండస్ట్రీ హీరో చేయని విధంగా చాల కొత్తగా సినిమా ప్రొమోషన్స్ కి శ్రీకారం చుట్టారు నాగ శౌర్య. ఏంటి నాగ శౌర్య అంత వెరైటీ గా ఎం ప్రమోషన్ చేస్తున్నారని అనుకుంటున్నారా. ఎందుకు ఆలస్యం మ్యాటర్ లోకి వెళదాం.
నాగ శౌర్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో వరుడు కావలెను అనే సినిమా ఒకటి. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకొని ఈ నెల 29 న విడుదలకు సర్వం సిద్ధం అయింది. కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది.
ఇపుడు అసలైన మ్యాటర్ లోకి వెళ్తే ఈ వరుడు కావలెను సినిమాకి సంబందించిన ప్రొమోషన్స్ లోని భాగంగానే నాగ శౌర్య మరియు హీరోయిన్ రీతూ వర్మ కలిసి హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలలో జరిగే పెళ్ళిళ్ళకి అతిథిలుగా వెళ్ళి అందరికి షాక్ ఇచ్చారు.
ఎవరు ఇలా పెళ్ళికి ఒక హీరో, హీరోయిన్ గెస్ట్ గా వస్తరని ఊహించారు. కానీ ఆ ఊహని నాగ శౌర్య మరియు రీతూ వర్మ నిజం చేశారు. గతం లో ఏ సెలబ్రిటీ ఇలాంటి గెస్ట్ అప్పీయరెన్స్ చేయలేదు కానీ మొట్టమొదటి సారి నాగ శౌర్య చాల వెరైటీ గా అలోచించి వరుడు కావలెను సినిమా ప్రొమోషన్స్ ఇలా హైదరాబాద్ లో జరిగే పెళ్ళిళ్ళకు సడన్ సప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చారు.
ఏదేమైనా ఇలాంటి ఒక కొత్త రకమైన ప్రమోషన్ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. ఆల్రెడీ సినిమా బుకింగ్ బాగా జరుగుతున్నాయి. చూడాలి మరి అక్టోబర్ 29 న వరుడు కావలెను సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులని అలరించబోతుందో.