Naga Chaitanya Turned as Vilan : విలన్ గా మారిన నాగ చైతన్య :-

Naga Chaitanya Turned as Vilan :- నాగ చైతన్య వరుస సినిమాలతో లైఫ్ బిజీ బిజీ గా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అటు అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా అనే హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ అనే క్లాసిక్ రీమేక్ చేస్తుండగా , ఇంకో పక్క నాగార్జున గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బంగారాజు ఇలా సినిమాలతో బిజీ గా ఉన్నారు.
అయితే ఇదివరకే లవ్ స్టోరీ సినిమా ప్రొమోషన్స్ భాగం లో ఇంటర్వ్యూ ఇయ్యగా అందులో భాగంగానే చైతు తాను విలన్ గా వెబ్ సిరీస్ చేస్తున్న అని అధికారికంగానే చెప్పేసారు.
అయితే మ్యాటర్ లోకి వెళ్తే నాగ చైతన్య విక్రమ్ కుమార్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ కి ఒక హారర్ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో చైతు విలన్ గా చేస్తున్నారని చెప్పకనే చెప్పారు.
దీనితోపాటు చైతు ఎం చెప్పారంటే ” నేను థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలలో చేయని పాత్రలని ఓటీటీ రూపం లో చేయాలనీ అనుకున్నాను అని , ఫ్యూచర్ లో ఎన్నో ఓటీటీ ప్రాజెక్ట్స్ చేయాలనీ అనుకున్న అని , అందులో నేను చేయాలనుకున్న విభిన్న పాత్రలు చేస్తానని చెప్పారు ‘.
మొత్తానికి నాగచైతన్య లవర్ బాయ్ పాత్రలు థియేటర్లో మరియు విభిన్న పాత్రలు ఓటీటీ ద్వారా ప్రజలకు డిఫరెంట్ వేరియేషన్స్ అఫ్ చైతు చూపించబోతున్నారని అర్ధం అయింది. చూడాలి మరి చైతన్య విభిన్న పాత్రలతో ప్రజలని ఎలా కనువిందు చేయనున్నారో.