Naga Chaitanya loosing Hopes : నాగ చైతన్య ఆశలు నిరాశలుగా మిగిలేనా :-

Naga Chaitanya loosing Hopes : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ, బిజీ గా కాలం గడుపుతున్న ఎక్కడో తాను ఆశలు పెటుకున్నాది నిరాశగా మారుతుందేమో అన్న బాధ చైతు కి వెంటాడుతూనే ఉంది.
చైతు హిందీ లో, తెలుగు లో ప్రస్తుతం 5 సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా చైతు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మొత్తానికి వినాయక చవితి విడుదల అని సన్నాహాలు , పబ్లిసిటీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ పైన ఇష్యూస్ జరుగుతూనే ఉండటం తో సినిమా పోస్ట్ పోన్ అయి సెప్టెంబర్ చివరిలోకి వాయిదా వేసుకున్నారు.
కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి తో జరగాల్సిన మీటింగ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి , కాబట్టి టికెట్ రేట్స్ పై ఈ నెలలో క్లారిటీ వచ్చేలా లేదు అని అందరికి అర్ధం అవుతుంది. అయితే లవ్ స్టోరీ మీద చైతు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కెరీర్ బెస్ట్ సినిమా అవుతుందని , కానీ ఈ సినిమాకే ఇలా ఎన్నో అడ్డంకులు రావడం చాల బాధాకరం.
ఈ టికెట్స్ ఇష్యూ ఇలాగె కొనసాగితే నాని టక్ జగదీశ్ లాగ లవ్ స్టోరీ కూడా ఓటీటీ కి అమ్ముకొని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వడం లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సినిమా థియేటర్ లు బ్రతకాలి అనే ఉద్దేశం తోనే ఓటీటీ లో మంచి ఆఫర్లు వస్తున్నా అమ్మడం లేదు.
చూడాలి మరి మీటింగ్ ఎపుడు జరగబోతుందో … టికెట్స్ పై ఆంధ్ర ప్రదేశ్ సీఎం ఎం చెప్పబోతున్నారో అని …