Tollywood news in telugu

రొమాన్స్ చేయడానికి అందమైన అమ్మాయి దొరికింది అంటున్న మన్మధుడు

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నాచ్యురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “devadas”. ఈ చిత్రంలో నాగ్ దేవ అనే డాన్ పాత్రలో నటిస్తుండగా, నాని దాస్ అనే డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ ఎంటర్టైనెర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నాని సరసన రష్మీక నటిస్తుంది. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. సీనియర్ ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ ఈ devadas చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈ చిత్రం పేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఆ తరువాత సాంగ్స్ ని సింగిల్స్ రూపంలో లిరికల్ వీడియోలతో ఒక్కక్కోటిగా విడుదల చేసారు. ఇవి ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసాయి.

Read  కోటి రూపాయలు కొంప ముంచిన... కత్తి కార్తీక

రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర యూనిట్ devadas సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ లో పోస్టర్స్ లో ఎక్కడా హీరోయిన్స్ లుక్ ని చిత్రయూనిట్ రెవీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో దేవ(నాగ్) లవర్ జాన్వి(ఆకాంక్ష)ని పిక్ ఉన్న ఓ పోస్టర్‌ని సోషల్ మీడియాలో ‘దేవ లవర్ ఆకాంక్షను పరిచయం చేస్తున్నాం. ఆమె దేవదాస్ చిత్రంలో జాన్విగా నటిస్తోంది’ అని ట్వీట్ చేసింది. హాయ్! అంటూ కుర్రాళ్లను మాయలో పడేసింది ఈ పోస్టర్ లో. ఇది చూసిన నాగ్ వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘‘చాలా రోజుల తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి! మళ్లీ రొమాన్స్ చేయడానికి. దేవదాస్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. దీనిని చూసిన అభిమానులు , నెటిజన్లు తెగ షేర్ చేస్తూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

Read  మరో వివాదం లో ధోని

నాగ్ ఈ ట్వీట్ చేయగానే ఒక ఫ్యాన్ ఈ అమ్మాయి కంటే అందమైన అమ్మాయా సార్? అంటూ `అనుష్క- నాగార్జున` కాంబో ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తాజాగా దాస్ హీరోయికి జోడీగా నటించబోతున్న రష్మిక ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ‘పూజ’గా కనిపించబోతోందని ఈ స్టిల్ ద్వారా తెలిపారు.
అంతేకాదు నాని కూడా తన లవర్ పూజ గురించి (రష్మిక మందన) ఫస్ట్ టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్ అయ్యింది పూజ గారు మళ్లీ ఎప్పుడు ?’ అంటూ నాని అంటున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button