Nag is ready to Romance with Srilankan Beauty : నాగార్జున ఘోస్ట్ లో శ్రీలంకన్ బ్యూటీ :-

Nag is ready to Romance with Srilankan Beauty : నాగార్జున వరుస సినిమాలతో బిజీ ఉన్నపటికీ స్క్రిప్ట్ సెలక్షన్ లో మాత్రం ఎక్కడ తగ్గారు. అయన చేసే ప్రతి సినిమాలో కథని నమ్మే హీరో. అలాంటి నాగార్జున మొదటి సారి గరుడవెగ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా కి టైటిల్ ఘోస్ట్ అని అధికంగా ప్రకటించారని మనందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మొదట్లో కాజల్ అగర్వాల్ అనుకున్నారు కానీ కాజల్ లాంగ్ బ్రేక్ తీసుకొని , కొన్ని నెలలు సినిమా షూటింగ్స్ కి దూరం ఉండాలని నిర్ణయించుకుంది. అందుకనే కాజల్ ఎన్ని ఆఫర్లు వస్తున్నా నిరాకరిస్తుంది. తాను చివరిగా చిరంజీవి ఆచార్య లో చేసింది.
అయితే కాజల్ పర్సనల్ రీజన్స్ వల్ల సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇయ్యడం తో ఘోస్ట్ చిత్ర బృందం కాజల్ బదులు ఎవరు అని ఆలోచిస్తే శ్రీలంకన్ బ్యూటీనీ అనుకున్నారంట.
ఆమె ఎవరో కాదు ఇటీవలే ప్రభాస్ సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ పాటలో డార్లింగ్ పక్కన చిందులేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
ఇటీవలే ఘోస్ట్ చిత్ర బృందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని కలిసి దీనిపై చర్చించినట్లు తెలుస్తుంది. జాక్వెలిన్ ఇంకా కన్ఫర్మేషన్ ఇయ్యలేదు. తన కన్ఫర్మేషన్ కోసం చిత్ర బృందం ఎదురు చూస్తున్నట్లు చిత్రసీమ లో టాక్.
చూడాలి మరి నాగ్ పక్కన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలా ఉండబోతుందో. ప్రవీణ్ ఘోస్ట్ స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతుందో మరి. ఘోస్ట్ లో నాగ్ సరసన నటించేందుకు ఎవరు ఫిక్స్ అయ్యారో త్వరలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తారు.