నభా నటేష అందుకు ఒప్పుకుందా ?
ఈ ఏడాది హీరో నితిన్ ఆరంభంలోనే భీష్మ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నా…తర్వాత బాలీవుడ్లో పెద్ద హిట్ అయిన “అంథాధూన్’ సినిమా తెలుగు రీమేక్లో హీరోగా నటించబోతున్నారు. ఈ మేరకు లాక్ డౌన్ తర్వాత.. ప్రీ ప్రొడక్షన్ పనులు, షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్ స్మార్ట్ బ్యూటీ నభ నటిష హీరోయిన్ గా నటిస్తుంది.
మొదట ఈ చిత్రానికి హీరోయిన్ ఆరుల్ మోహన్ ని అనుకోగా…కానీ చివరికి చిత్ర బృందం నభా నటేష్ వైపు మొగ్గు చూపింది. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ హిందీ లో తీసిన “అంథాధూన్ ” చిత్రంలో హీరోయిన్ రాధికా ఆప్టే హాట్ సన్నివేశాల్లో నటించారు… దీంతో తెలుగు లో కూడా నభా నటేష్ ఘాటు సన్నివేశాలో నటించబోతుందా?? అన్ని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు…
ఈ విషయంపై తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నభ నటిష స్పందించారు…. ఈ మేరకు తెలుగు రీమిక్స్ లో హాట్ సన్నివేశాలు ఉండవని తేల్చి చెప్పేసింది. ఈ చిత్రన్ని పూర్తిగా సౌత్ జోన్ పరంగా నిర్మించబోతున్నాట్లు తెలిపింది…. ఇంకా ఆ హిందీ చిత్రంలో తంబు పాత్ర నెగిటివ్ రోల్ ని తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులు చూస్తున్నట్లు చిత్ర బృందం సమాచారం అందించింది. ఈనెల ఆఖరున చిత్ర షూటింగ్ లో నభ నటిష పాల్గొనబోతున్నారు…