Tollywood news in telugu

Kajal heroin : ఆ విషయంలో నా మొగుడు నన్ను ఇరిటేట్ చేసాడు….!

Kajal Aggarwal : ప్రపంచానికి చందమామ ఆ చంద్రుడైతే.. టాలీవుడ్ కి చందమామ కాజల్ అగర్వాల్. ఈ చందమామ హీరోయిన్ గత ఏడాది తన చిన్నప్పటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది. వీరి పెళ్లి అతి కొద్ది మంది అతిధుల మధ్య వైభవంగా జరిగింది. కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ వీరి పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా అక్టోబ‌ర్ 30న జరిగింది. 

Kajal Aggarwal

కానీ కాజల్ అభిమానులు మాత్రం కాస్త నిరాశకు లోనయ్యారు . ఎందుకంటే పెళ్లి తరవాత కాజల్ సినిమాలకు దూరమౌతుందని అనుకున్నారు.  అలాగే కాజల్ ని ఇష్టపడే అబ్బాయిలు కూడా కాస్త నిరాశకు లోనయ్యారు.. ఈ విషయం వేరే అనుకోండి. గౌతమ్ గురించి పలు ఇంటర్వ్యూ లో కాజల్ మాట్లాడుతూ…. తనని బాగా  అర్థం చేసుకొనే వాడు దొరకడం తన అదృష్టం అని చెప్పింది.  దీనితో పాటుగా మరికొన్ని విషయాలు గౌతమ్ గురించి బయటపెట్టింది. తాజాగా మోస‌గాళ్లు ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మాట్లాడిన కాజ‌ల్ , ఒక విషయంలో మాత్రం గౌతమ్ చాల ఇరిటేట్ చేస్తాడు అని చెప్పికొచ్చింది.

కాజల్ అగర్వాల్ కి షూటింగ్స్  వల్ల సూర్యోదయానికి ముందే లేచే అలవాటు ఉంది. అది కాస్త అలవాటుగా మారి కాజల్ ప్రతిరోజూ సూర్యుడికంటే ముందే లేస్తుంది. కానీ గౌతమ్ ఆలా కాదట చాల లేట్ గా లేవడం, ఎక్స‌ర్‌సైజ్ చేయడానికి లేట్ గా రావడం వల్ల కాజల్ కి ఇరిటేట్ వస్తుందట.. ఈ విషయాన్నీ స్వయంగా కాజల్ తెలిపింది. ఇక పెళ్లి అయ్యాక సూర్యనమస్కారాలు చేయడం తగ్గిపోయిందని, ఇకనుండి రెగ్యులర్ గా సూర్యనమస్కార్ చేస్తానని చెప్పుకొచ్చింది. 

ఇక కాజల్ చేస్తున్న సినిమా విషయాలకు వస్తే… ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య మూవీలో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే… ఇపుడు తాజాగా అక్కినేని నాగార్జున సరసన స్టెప్పులేయడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇక మరికొన్ని సినిమాల స్క్రిప్టులు వింటుందట . అదేవిదనగా మోసగాళ్లు సినిమా అందరిని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button