వామ్మో ఇది విన్నారా…! అతడి రక్తంలో ఏకంగా పుట్టగొడుగులే పెరుగుతున్నాయి…!

జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ కన్సల్టేషన్ – లియసన్ సైకియాట్రీ ఓ ఆసక్తికరమైన ఈ కథనాన్ని ప్రచురించింది. ఓ యువకుడి బ్లడ్ లో పుట్ట గొడుగులు పెరుగుతున్నాయట…!
ఓ 30 ఏళ్ల యువకుడు మత్తుపదార్థాలకు బానిస అవ్వడంతో..బైపోలార్ అనే డిజార్డర్ వచ్చింది. మాదకద్రవ్యాల నుండి బయట పడేందుకు సొంత వైద్యం చేసుకోవడం మొదలెట్టాడు. అంతర్జాలంలో సిలోసెబిన్ పుట్టగొడుగులు ఆందోళన, ఒత్తిళ్ల నుండి బయట పడేందుకు ఉపయోగపడుతాయని ఉండడంతో…ఆ యువకుడు పుట్టగొడుగులను టీ లాగా చేసుకుని ఇంజెక్షన్ ద్వారా బ్లడ్ లోకి ఎక్కించుకున్నాడు.
దీంతో రెండు రోజులకే ఆ యువకుడు అస్వస్థతకు గురవడంతో చికిత్సకోసం ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించగా… అతడు తీసుకున్న పుట్టగొడుగుల టీ వల్ల బ్లడ్ లో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభించాయని వైద్యులు తెలిపారు.
ఆ యువకుని రక్షించడానికి వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేశారు. డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేశారు. అలాగే ఇన్ఫెక్షన్ తగ్గడానికి వైద్యం మందులు వాడమని సలహా ఇవ్వడంతో… ఎలాగోలా యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి