News
భూకుంభకోణం లో మురళీమోహన్ కూతురు !

తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాలు తరతరాలు కూర్చొని తిన్న కరగని ఆస్తులను కుంభకోణాలు చేస్తూ సంపాదించారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విమర్శించారు.
జగన్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ల్యాండ్స్ ని చంద్రబాబు తన బినామీ అయినటువంటి మురళీమోహన్ కూతురు కి 32 ఎకరాలను కట్టబెట్టారని తెలిపాడు.
ఎకరానికి 50లక్షలు ఉండే భూమిని కేవలం ఎకరానికి 8 లక్షలకు అప్పజెప్పారని దుయ్యబట్టారు. ఈ విదంగా లీగల్ గా కబ్జాలు చేసి ఆ స్థలంలో ఇల్లుకట్టుకున్న పేదవారిని వెళ్లగొట్టారు. ఈ విషయంపై అడిగే వాళ్ళే లేకుండాపోయారు. ఈ విదంగా వారి తరాలు కూర్చొని తిన్న తరగని కబ్జాలు చేసి ప్రజలను ముంచారని వెల్లడించారు జగన్ .